Site icon NTV Telugu

Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్.. బాబు బాగోతం మాములుగా లేదు..

Fake

Fake

Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కలకలం సృష్టించింది.. బాబు బాగోతం మామూలుగా లేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లపై శశికాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు.. స్పెషల్ ఆఫీసర్ అంటూ బిల్డర్లతో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు.. పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూళ్లు చేశాడు.. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరింపులకు దిగాడు.. ఈ నిందితుడిపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.

READ MORE: CM Chandrababu: చాయ్‌వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..

ఈ అంశంపై వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసులు మాట్లాడారు. “శశికాంత్ ఇద్దరు బాడీగార్లను పెట్టుకుని మోసాలకు పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన ఇద్దరు బాడీగార్డ్‌లను తమ ఆయుధాలతో వెంట ఉండేవారు.. వాహనాలకు పోలీస్ సైరన్లతో పాటుగా వాకీటాకీలను పెట్టుకుని నమ్మించాడు.. శశికాంత్ టీఎస్ ఐఐసీకి చెందిన ఫోర్జ్‌రీ లెటర్‌ను దగ్గర పెట్టుకొని అది చూపిస్తూ పలువురిని మోసాలకు పాల్పడ్డాడు. టీఎస్ ఐఐసీలో ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి గోల్డ్ జిమ్ ఓనర్ తో పాటు పలువురిని మోసం చేశాడు. గోల్డ్ జిమ్ నిర్వాహకుడు అలీ హసన్ దగ్గర 10 లక్షల రూపాయల మేర నమ్మించి వసూలు చేశారు. జిమ్ సూపర్వైజర్ దగ్గర కూడా 8 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇంటి యజమానిని కూడా నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి శశికాంత్‌ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుడి దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లో ఆర్ సిమ్ కార్డులు రెండు వాకీ టాకీలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు తమ పర్సనల్ ప్రొటెక్షన్ కోసమే వాడాలి. ఇతరుల రక్షణ కోసం వాడొద్దు. ఇది చట్టరీత్యా నేరం.. తమిళనాడుకు చెందిన లైసెన్సు హోల్డర్లు ఇక్కడ గన్మెన్లుగా వ్యవహరించారు.. వీరిపై కేసులు నమోదు చేశాం.. ప్రభుత్వ అధికారులమని చెప్పి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎవరు కూడా అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు..” ” అని డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

Exit mobile version