NTV Telugu Site icon

Film Fare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో ‘చిన్నా’ హవా.. ఏకంగా 7 అవార్డులు!

Chinna Movie

Chinna Movie

Film Fare Awards 2024 Tamil: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో ‘చిన్నా’ సినిమా సత్తాచాటింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌), ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీతం విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో త‌మిళంలో తెరకెక్కిన ‘చిత్తా’ని తెలుగులో చిన్నా పేరుతో విడుద‌ల చేశారు. ఎస్‌యు అరుణ్‌ కుమార్‌ దర్శకుడు. సిద్ధార్థ్ న‌టిస్తూ స్వ‌యంగా నిర్మించిన చిత్తా త‌మిళంలో పాటు తెలుగులోనూ విమ‌ర్శ‌కుల మెప్పు పొందింది.

పొన్నియిన్‌ సెల్వన్‌ 2కు కూడా అవార్డుల పంట పండింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో 5 అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గేయ సాహిత్యం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది. వెట్రిమారన్‌ పార్ట్‌-1కు ఉత్తమ చిత్రం క్రిటిక్స్‌ అవార్డు వచ్చింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తమిళ చిత్రాల విజేతలు జాబితాను ఓసారి చూద్దాం.

తమిళ విజేతలు:
ఉత్తమ చిత్రం: చిత్త
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): వెట్రిమారన్‌ (విడుదలై పార్ట్‌-1)
ఉత్తమ నటుడు: విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): సిద్ధార్థ్‌ (చిత్త)
ఉత్తమ నటి: నిమేషా సజయన్‌ (చిత్త)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ (చిత్త)ఉత్తమ నటి (క్రిటిక్స్‌): ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్హానా), అపర్ణ దాస్‌ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్‌ (చిత్త)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్‌ థామస్‌, సంతోష్‌ నారాయణన్‌ (చిత్త)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్‌ (చిత్త)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్‌ (అగ నగ.. పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తోట తరణి (పొన్నియిస్‌ సెల్వన్‌2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)