NTV Telugu Site icon

Fighter: 14వ సారి 100 కోట్ల క్లబ్‌లోకి హృతిక్ రోషన్.. లిస్ట్ ఇదే!

Fighter Movie

Fighter Movie

Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్‌’ త‌ర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడం, ‘ప‌ఠాన్‌’ త‌ర్వాత వ‌స్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావ‌డంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో హృతిక్ రోషన్ 14వ సారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు.

ఫైటర్ చిత్రంతో హృతిక్ రోషన్ ఖాతాలో మరో రికార్డ్ కూడా చేరింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డేకి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఫైటర్ మూవీ అభిమానులని అలరిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. వార్ తర్వాత సింగిల్ డేలో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా రికార్డు సాధించింది.

హృతిక్ రోషన్ కెరీర్‌లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ సినిమాతో మొదలైంది. క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లోనే 100 కోట్లు సాధించాయి. జిందా న మిలేగా దోబారా, మొహంజదారో, సూపర్ 30, విక్రమ్ వేద సినిమాలు 100 కోట్లు సాధించిన చిత్రాలుగా ఉన్నాయి.

Also Read: IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. రోహిత్ శర్మ పాదాలు తాకిన అభిమానికి 14 రోజుల రిమాండ్!

100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితా ఇదే. 
1. కభీ ఖుషి కభీ గమ్
2. క్రిష్
3. ధూమ్2
4. జోధా అక్బర్
5. జిందా న మిలేగా దోబారా
6. అగ్నిపథ్
7. క్రిష్ 3
8. బ్యాంగ్ బ్యాంగ్
9. మొహంజదారో
10. కాబిల్
11. సూపర్ 30
12. వార్
13. విక్రమ్ వేద
14. ఫైటర్

Show comments