Fighter: 14వ సారి 100 కోట్ల క్లబ్‌లోకి హృతిక్ రోషన్.. లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్’ తర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడం, ‘పఠాన్’ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో హృతిక్ రోషన్ 14వ సారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు.
ఫైటర్ చిత్రంతో హృతిక్ రోషన్ ఖాతాలో మరో రికార్డ్ కూడా చేరింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డేకి విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. మంచి పాజిటివ్ టాక్, హృతిక్ రోషన్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఫైటర్ మూవీ అభిమానులని అలరిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. వార్ తర్వాత సింగిల్ డేలో 40 కోట్లు సాధించిన హృతిక్ రెండవ చిత్రంగా రికార్డు సాధించింది.
Also Read
హృతిక్ రోషన్ కెరీర్‌లో ఫైటర్ చిత్రం వరుసగా 100 కోట్లు సాధించిన 10వ చిత్రంగా నిలిచింది. ఈ 100 కోట్ల పరంపర 2001లో కభీ ఖుషి కభీ గమ్ సినిమాతో మొదలైంది. క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలు కూడా అప్పట్లోనే 100 కోట్లు సాధించాయి. జిందా న మిలేగా దోబారా, మొహంజదారో, సూపర్ 30, విక్రమ్ వేద సినిమాలు 100 కోట్లు సాధించిన చిత్రాలుగా ఉన్నాయి.
Also Read: IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. రోహిత్ శర్మ పాదాలు తాకిన అభిమానికి 14 రోజుల రిమాండ్!
100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితా ఇదే.
1. కభీ ఖుషి కభీ గమ్
2. క్రిష్
3. ధూమ్2
4. జోధా అక్బర్
5. జిందా న మిలేగా దోబారా
6. అగ్నిపథ్
7. క్రిష్ 3
8. బ్యాంగ్ బ్యాంగ్
9. మొహంజదారో
10. కాబిల్
11. సూపర్ 30
12. వార్
13. విక్రమ్ వేద
14. ఫైటర్
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!