Site icon NTV Telugu

Mumbai: రన్నింగ్ ట్రైన్‌లో డోర్ దగ్గర నిలబడి.. రక్తం వచ్చేలా కొట్టుకున్న యువతులు(వీడియో)

Mumbai

Mumbai

ముంబై లోకల్ రైళ్లను రద్దీ కామన్. లోకల్ రైళ్లలో జరిగే పోరాటాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఇద్దరు యువతులు లోకల్ రైలులో ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనను లేడీస్ కోచ్‌లో చోటు చేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఈ ఘర్షణ వీడియోను తీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: PM Modi in Vizag: విశాఖకు ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం..

వీడియో ప్రకారం.. ముంబై లోకల్ రైలులోని లేడీస్ కోచ్‌లో ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో కొంత మంది మహిళలు ఆ రైలు డోర్ వద్ద నిలబడి ఉన్నారు. ఏదో విషయంపై యువతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ చిన్న వాదన కొద్దిసేపటికే పెద్ద గొడవగా మారింది. దీంతో ఇద్దరు యువతులు ఒకరికొకరు జుట్టు పట్టుకుని బలంగా లాక్కున్నారు. ఒకరినొకరు రక్తం వచ్చే వరకు కొట్టుకున్నారు. కొంతమంది మహిళలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటన చర్చిగేట్-విరార్ లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ లో జరిగింది. ఈ అంశంపై స్పందించిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది.. ఘర్షణ పడిన జ్యోతి, కవిత అనే ఇద్దరు మహిళలను భయాందర్ రైల్వే స్టేషన్‌లో దింపారు. అక్కడి నుంచి వారిని భయాందర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ.. ఇద్దరు యువతులు ఫిర్యాదులు చేసుకోకుండా సమస్యను పరిష్కరించుకున్నారు.

READ MORE: Vidadala Rajini: ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు..

Exit mobile version