FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ప్రపంచకప్‌గా ఈ ఎడిషన్ నిలిచింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అందుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ను మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఇక నెదర్లాండ్స్ స్టార్ కోడీ గాక్పో స్వీడన్‌పై 5-1 తేడాతో గెలిచిన మ్యాచ్‌లో జట్టు తరఫున మూడో గోల్ సాధించి టోర్నీలో 100వ గోల్‌ను నమోదు చేశాడు.
ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ చేరుకోవడానికి కేవలం 33 మ్యాచ్‌లు మాత్రమే పట్టడం కొత్త రికార్డు. గతంలో 1982, 2014 ప్రపంచకప్‌లలో 36 మ్యాచ్‌లు, 1978, 1994 టోర్నీలలో 38 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అయితే 1954లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. ఇక నెదర్లాండ్స్ జట్టు కూడా మరో అరుదైన ఘనత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ క్లబ్లో చేరిన ఎనిమిదో దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ బ్రోబ్బే రెండు గోల్స్ సాధించగా.. అతని రెండో గోల్ నెదర్లాండ్స్‌కు ప్రపంచకప్‌లలో 100వ గోల్‌గా చరిత్రలో నిలిచింది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అలాగే మాంటెరే స్టేడియంలో జపాన్, ట్యునీషియా జట్ల మధ్య జరిగిన గ్రూప్-F మ్యాచ్ ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 1,000వ మ్యాచ్‌గా నమోదైంది. ఈ సందర్భంగా ఫిఫా స్పందిస్తూ.. “1,000వ మ్యాచ్ ప్రపంచకప్ సుదీర్ఘ ప్రయాణానికి, ఫుట్‌బాల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానానికి నిదర్శనం. దేశాలు, సమాజాలను ఏకం చేసే ఫుట్‌బాల్ శక్తికి ఇది నిదర్శనం” అని పేర్కొంది.
Netherland becomes the 8th club with 100 goals in the world cup history, with having score the most goals against Sweden today and against Spain 2014, 5-1 opening the scoring with the iconic van persie header that had casillas shocked. pic.twitter.com/8Fu2WOm5KC
— Hxbeeb (@Habeeb8607) June 20, 2026
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!