FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు కూడా చివరి ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాయి.
జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్స్:
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో బలమైన ఫ్రాన్స్‌ను మొరాకో ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఇప్పటికే పలు సంచలన విజయాలు సాధించిన మొరాకో మరోసారి దిగ్గజ జట్టుకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అదే రోజు మరో హై-వోల్టేజ్ పోరులో యూరప్ దిగ్గజాలు స్పెయిన్, బెల్జియం తలపడనున్నాయి.
Also Read
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
జూలై 12న జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎర్లింగ్ హాలాండ్ సారథ్యంలో నార్వే, ఇంగ్లండ్‌తో తలపడనుంది. బ్రెజిల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన నార్వే అదే జోరును కొనసాగించాలని చూస్తుండగా.. ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్ కోసం పోరాడనుంది. ఇక చివరి క్వార్టర్ ఫైనల్లో లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా స్విట్జర్లాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈజిప్ట్‌పై 0-2 నుంచి 3-2తో అద్భుతంగా పుంజుకుని క్వార్టర్స్‌కు చేరిన అర్జెంటీనా, ఇప్పుడు మరో విజయంతో సెమీఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్ షెడ్యూల్:
జూలై 10: ఫ్రాన్స్ vs మొరాకో.
జూలై 10: స్పెయిన్ vs బెల్జియం.
జూలై 12: నార్వే vs ఇంగ్లండ్.
జూలై 12: అర్జెంటీనా vs స్విట్జర్లాండ్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!