FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన చివరి ప్రపంచకప్ టోర్నీని నిరాశతో ముగించాడు. రౌండ్ ఆఫ్-16లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పోర్చుగల్ 1-0 తేడాతో స్పెయిన్ (Spain) చేతిలో ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ మొత్తం ఇరు జట్లు సమానంగా పోరాడినప్పటికీ.. అదనపు సమయంలో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు ప్రత్యామ్నాయ ఆటగాడు మికెల్ మెరినో (Mikel Merino) చేసిన గోల్. మ్యాచ్ చివరి క్షణాల్లో వచ్చిన ఈ గోల్ పోర్చుగల్ ఆశలను చెల్లాచెదురు చేసింది. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను తన ఆటతో అలరించిన రొనాల్డో.. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టడం అభిమానులను కలచివేసింది.
Also Read
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
- Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
2006లో తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన రొనాల్డో, ఈ టోర్నీ తన చివరిదని ముందుగానే ప్రకటించాడు. జట్టును మరోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేర్చాలన్న అతని కల నెరవేరకపోయినా.. పోర్చుగల్ తరఫున తన ప్రస్థానంపై గర్వంగా ఉందని తెలిపాడు. పోర్చుగల్ తరఫున మూడు ప్రధాన టైటిళ్లు గెలిచానని.. 2016 యూరో కప్ విజయం తనకు ప్రపంచకప్‌తో సమానమైన అనుభూతిని ఇచ్చిందని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో కాకుండా ఫుట్‌బాల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచిన రొనాల్డో.. తన భవిష్యత్తుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశాడు. భావోద్వేగ పరిస్థితుల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని, కుటుంబంతో సమయం గడిపిన తర్వాత భవిష్యత్తుపై ఆలోచిస్తానని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే.. పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ (Roberto Martinez) పదవీ విరమణపై కూడా రొనాల్డో స్పందించాడు. మార్టినెజ్ గొప్ప కోచ్ మాత్రమే కాకుండా మంచి వ్యక్తి అని ప్రశంసించిన అతడు, పోర్చుగల్ ఫుట్‌బాల్‌కు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపాడు. రోవైపు ఈ విజయంతో స్పెయిన్ చారిత్రక రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా క్లీన్ షీట్ నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. గతంలో ఇటలీ, స్విట్జర్లాండ్ జట్ల పేరిట ఉన్న ఐదు వరుస క్లీన్ షీట్ల రికార్డును అధిగమించింది.
స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ (Unai Simon) కూడా ఓ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా 609 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా నిలిచి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సమయం గోల్‌ను కాపాడిన గోల్‌కీపర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఇటలీ దిగ్గజం వాల్టర్ జెంగా (Walter Zenga) పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డు చెరిగిపోయింది.
తాజావార్తలు
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!