FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 Mexico: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య దేశమైన మెక్సికో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తుంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది. గ్రూప్-Aలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మెక్సికో.. నేడు దక్షిణ కొరియాను కూడా ఓడించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించిన మెక్సికో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో తరఫున లూయిస్ రోమో 50వ నిమిషంలో ఏకైక గోల్ నమోదు చేశాడు. ఆ గోల్‌తో మెక్సికో ఆధిక్యంలోకి వెళ్లగా.. మ్యాచ్ ముగిసే వరకు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ కొరియా పలుమార్లు సమం చేసే అవకాశాలను సృష్టించినప్పటికీ, మెక్సికో గోల్‌కీపర్ రాంగెల్ అద్భుతమైన సేవ్ లతో జట్టును కాపాడాడు.
Also Read
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్‌లు..
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ప్రస్తుతం గ్రూప్-A పట్టికలో మెక్సికో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ కొరియా మూడు పాయింట్లతో రెండో స్థానంలో, చెక్ రిపబ్లిక్ మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉన్నాయి. స్వదేశీ అభిమానుల మద్దతుతో మెక్సికో మరో కీలక విజయాన్ని అందుకుని ప్రపంచకప్‌లో టైటిల్ రేసులో తన సత్తాను చాటుతోంది. నాకౌట్ దశలో కూడా ఇదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి మరి.
An update on how Group A and B are looking! 👊#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 19, 2026
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్‌లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!