FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ (Switzerland) గ్రూప్-B పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన వారి రెండో మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా (Bosnia and Herzegovina) పై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో అర్ధభాగంలో మిడ్‌ఫీల్డర్ జోహాన్ మంజాంబి రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి కారణంగా నిలిచాడు.
ఖతార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన స్విట్జర్లాండ్, ఈసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగం నిరాశాజనకంగా సాగినా.. రెండో అర్ధభాగంలో జట్టు దూకుడు పెంచి వరుస గోల్స్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన జోహాన్ మంజాంబి రెచ్చిపోయాడు. తొలి గోల్‌ను బలమైన షాట్‌తో నమోదు చేసిన అతడు.. ఆయా తర్వాత మరో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 20 సంవత్సరాల 247 రోజుల వయసులో ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన స్విస్ ఆటగాడిగా మంజాంబి చరిత్ర సృష్టించాడు. అలాగే బెంచ్ నుంచి వచ్చి స్విట్జర్లాండ్ తరఫున ప్రపంచకప్‌లో ఒకటి కంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
Also Read
- Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
మ్యాచ్ అనంతరం మంజాంబి మాట్లాడుతూ.. “ఇది ఇప్పటివరకు నా కెరీర్లో అత్యుత్తమ క్షణం. తొలి మ్యాచ్‌లో ఏమి తప్పు జరిగిందో మాకు తెలుసు. ఈరోజు ఓర్పుతో ఆడి మా సామర్థ్యాన్ని నిరూపించాం” అని ఆనందం వ్యక్తం చేశాడు. మంజాంబి గోల్ తర్వాత మరో ప్రత్యామ్నాయ ఆటగాడు రూబెన్ వర్గాస్ కూడా గోల్ చేసి స్విట్జర్లాండ్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఈ విజయంతో మంజాంబి అడిడాస్ గోల్డెన్ బూట్ రేసులో కూడా నిలిచాడు.
మ్యాచ్ మలుపు తిరగడానికి బోస్నియా ఆటగాడు తారిక్ ముహరేమోవిచ్కు రెడ్ కార్డు పడటం కూడా కీలక కారణమైంది. బ్రెల్ ఎంబోలోపై ప్రొఫెషనల్ ఫౌల్ చేయడంతో అతడిని మైదానం వీడాల్సి వచ్చింది. పది మంది ఆటగాళ్లతో మిగిలిన బోస్నియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఎక్స్ట్రా సమయంలో ఎర్మిన్ మహ్మిచ్ ఒక అద్భుత గోల్ చేసి బోస్నియాకు ఓదార్పు గోల్ అందించినప్పటికీ.. తిరిగి పుంజుకునే అవకాశం వారికి లభించలేదు. మ్యాచ్ చివర్లో స్విట్జర్లాండ్ కెప్టెన్ గ్రానిట్ జాకా పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని 4-1కు చేర్చాడు.
Success for Switzerland! 👏#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 18, 2026
తాజావార్తలు
-
Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!