FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-F తొలి మ్యాచ్‌లో జపాన్ (Japan) మరోసారి తన పోరాట పటిమను చాటుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో నెదర్లాండ్స్ (Netherlands)తో 2-2 తేడాతో డ్రా సాధించి విలువైన ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో డైచి కమాడా చేసిన గోల్ జపాన్‌కు ఓటమి నుంచి గట్టెక్కించింది.
మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో.. తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో ఆట పూర్తిగా మారింది. ఇరుజట్ల ఆటగాళ్లు నువ్వా.. నేనా.. అనేలా విజృంభించారు. దీనితో మ్యాచ్ వేగం పుంజుకుని ఏకంగా నాలుగు గోల్స్ నమోదయ్యాయి. రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లిన నెదర్లాండ్స్ విజయం దిశగా సాగినా.. చివరి వరకు జపాన్ పట్టుదలతో పోరాడి డ్రా మ్యాచ్ ను ముగించింది.
Also Read
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
మొదటి గోల్ ను నెదర్లాండ్స్ సాధించింది. రయాన్ గ్రావెన్బెర్చ్ ఇచ్చిన అద్భుతమైన పాస్ ను కెప్టెన్ వర్జిల్ వాన్ డైక్ హెడ్డర్ ద్వారా గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే జపాన్ వెంటనే స్పందించింది. కైటో నకమురా అద్భుతమైన లో షాట్‌తో స్కోరును 1-1తో సమం చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం తన మూడో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న క్రైసెన్సియో సమ్మర్విల్లే ఎడమ వైపు నుంచి లోపలికి కట్ చేసి, అద్భుతమైన కర్లింగ్ షాట్ తో గోల్ సాధించాడు. ఆ బంతి పోస్ట్‌ను తాకుతూ నెట్లోకి వెళ్లడంతో నెదర్లాండ్స్ 2-1 ఆధిక్యం సాధించింది.
సమయం తగ్గుతున్న జపాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సమం చేసే గోల్ కోసం బాగా ప్రయత్నించింది. చివరకు మ్యాచ్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు వచ్చిన కార్నర్‌ను ప్రత్యామ్నాయ ఆటగాడు కోకి ఒగావా హెడ్డర్ తో గోల్ వైపు మళ్లించాడు. ఆ బంతిని డైచి కమాడా స్వల్పంగా తాకడంతో దిశ మారి గోల్‌పోస్ట్ లోకి వెళ్లింది. దీంతో స్కోరు 2-2గా మారి జపాన్ అభిమానుల్లో సంబరాలు వెల్లువెత్తాయి. మొత్తానికి రెండుసార్లు వెనుకబడినప్పటికీ అసాధారణ పోరాట పటిమతో జపాన్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మరోవైపు ఆధిక్యాన్ని రెండుసార్లు కాపాడుకోలేకపోయిన నెదర్లాండ్స్ నిరాశతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
🚨 NETHERLANDS HAVE BOTTLED IT IN THE 89TH MINUTE! 😭
2-2! Ogawa scores the late equalizer for Japan and Oranje fans are in shock.
They were seconds away from the win… now it’s level.
Japan are built different. What a moment! #WorldCup2026 #NEDvsJPNpic.twitter.com/JYDMAbwwZY https://t.co/m0XI5TZtQB
— Gomariz10 (@MarioJohnmark) June 14, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!