FIFA World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-G తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయానికి చేరువలోకి వెళ్లినా.. స్వీయగోల్ కారణంగా ఆ కల నెరవేరలేదు. సియాటిల్ లోని సెంచురీలింక్ ఫీల్డ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియంతో 1-1తో డ్రా చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన అద్భుత గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈజిప్ట్, రెండో అర్ధభాగం ప్రారంభంలోనే వచ్చిన స్వీయగోల్ కారణంగా విజయాన్ని కోల్పోయింది.
ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని ఈజిప్ట్, బెల్జియంపై సంచలన ఫలితాన్ని నమోదు చేసే దిశగా అడుగులు వేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే బలంగా ఆడిన ఫరోస్ జట్టు, యూరోపియన్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చింది. మ్యాచ్ 34వ నిమిషంలో ఈజిప్ట్‌కు స్వర్ణావకాశం లభించింది. తన 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ ఆటగాడు మొహమ్మద్ సలాహ్ అద్భుతమైన పాస్‌ను అందించగా.. ఇమామ్ అషూర్ చాకచక్యంగా బంతిని నియంత్రించి బెల్జియం గోల్‌కీపర్ థిబాట్ కోర్టువాను మట్టికరిపిస్తూ గోల్ సాధించాడు. థామస్ మునియర్ కాళ్ల మధ్యగా దూసుకెళ్లిన అషూర్ షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌లో చేరడంతో ఈజిప్ట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. 28 ఏళ్ల అషూర్కు ఇది అంతర్జాతీయ కెరీర్లో తొలి గోల్ కావడం విశేషం. ఆ గోల్‌తో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఈజిప్ట్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
ఆధిక్యం కోల్పోయిన బెల్జియం రెండో అర్ధభాగంలో మార్పులతో బరిలోకి దిగింది. అనుభవజ్ఞుడైన స్టార్ స్ట్రైకర్ రొమేలు లుకాకు మైదానంలోకి వచ్చిన కేవలం 20 సెకన్లకే మ్యాచ్ మలుపు తిరిగింది. లుకాకు పెనాల్టీ బాక్స్ లోకి దూసుకెళ్లి థామస్ మునియర్ అందించిన క్రాస్‌ను అందుకునే ప్రయత్నం చేయగా, అతని ఒత్తిడికి గురైన ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హానీ బంతిని క్లియర్ చేసే క్రమంలో పొరపాటున తన సొంత గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ తప్పిదంతో బెల్జియం స్కోరు సమం చేసుకోగా.. మ్యాచ్ 1-1తో మారింది. ఆ తర్వాత ఈజిప్ట్ మరోసారి ఆధిక్యం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. అదృష్టం కలిసిరాలేదు. బెల్జియం కూడా గెలుపు గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి.
A hard-fought draw. 😤#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 16, 2026
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!