FIFA World Cup 2026: 40 ఏళ్ల గోల్‌కీపర్ అద్భుతం.. తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన కేప్ వెర్డే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 అరంగేట్ర మ్యాచ్‌లో ‘కేప్ వెర్డే’ (Cape Verde) చరిత్ర సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ (Spain)ను 0-0తో నిలువరించి ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే ఆటగాళ్లు అద్భుతమైన రక్షణాత్మక ప్రదర్శన కనబరిచి తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్ లోనే విలువైన పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నారు.
కేవలం 5.5 లక్షల జనాభా మాత్రమే ఉన్న ఈ ద్వీప దేశం పురుషుల ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రెండో అత్యంత చిన్న దేశంగా నిలిచింది. ప్రపంచ నంబర్-67 జట్టుగా బరిలోకి దిగిన కేప్ వెర్డే, ప్రపంచ నంబర్-2 స్పెయిన్‌ను గోల్ చేయకుండా అడ్డుకోవడం సంచలనం. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆధిపత్యం కొనసాగించింది. బంతి అధికంగా వారి వద్దే ఉన్నప్పటికీ.. కేప్ వెర్డే ఆటగాళ్లు పటిష్టమైన ‘లో బ్లాక్’ వ్యూహాన్ని అమలు చేస్తూ డిఫెండ్ లో అద్భుత క్రమశిక్షణ ప్రదర్శించారు. ముఖ్యంగా 40 ఏళ్ల అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ వోజిన్హా (Vozinha) అసాధారణ ప్రదర్శనతో స్పెయిన్ దాడులను పదేపదే తిప్పికొట్టాడు.
Also Read
- CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
- Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
- Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
- France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
మొదటి అర్ధభాగంలోనే వోజిన్హా నాలుగు కీలక సేవ్‌లు చేసి తన జట్టును కాపాడాడు. మార్క్ కుకురెల్లా అందించిన పాస్‌ను ఫెరాన్ టొరెస్ గోల్‌గా మలచేందుకు ప్రయత్నించగా.. బంతి క్రాస్‌బార్‌ను తాకింది. వెంటనే వచ్చిన రీబౌండ్పై మికెల్ ఒయార్జాబల్ చేసిన హెడర్‌ను వోజిన్హా అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం అయ్మెరిక్ లాపోర్టే కొట్టిన హెడర్‌ను కూడా హాఫ్‌టైమ్‌కు ముందు అద్భుతంగా నిలువరించాడు.
రెండో అర్ధభాగంలో స్పెయిన్ దాడుల తీవ్రతను పెంచినా ఫలితం లేకపోయింది. ఫాబియన్ రూయిజ్ దూరం నుంచి చేసిన ప్రయత్నం లక్ష్యాన్ని తప్పింది. స్పెయిన్ ఆటగాళ్లు వరుసగా దాడులు చేసినా కేప్ వెర్డే రక్షణ గోడను ఛేదించలేకపోయారు. గెలుపు కోసం ప్రయత్నించిన స్పెయిన్ కోచ్ లూయిస్ డి లా ఫుయెంటే 71వ నిమిషంలో యువ సంచలనం లమైన్ యమాల్‌ను మైదానంలోకి దించాడు. అతడు వచ్చిన తర్వాత స్పెయిన్ దాడుల్లో వేగం పెరిగినా, కేప్ వెర్డే ఆటగాళ్లు సమిష్టిగా అతడిని కట్టడి చేసి ప్రమాదకర అవకాశాలను దూరం చేశారు.
It all ends level ⚖️#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 15, 2026
మ్యాచ్ చివరి దశలో ఒయార్జాబల్కు మరోసారి గెలుపు అవకాశమొచ్చినా, అతని షాట్ లక్ష్యాన్ని తప్పడంతో స్పెయిన్ నిరాశకు గురైంది. దీంతో ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్ ఆడిన కేప్ వెర్డే చారిత్రాత్మక డ్రాతో సంబరాలు చేసుకోగా.. స్పెయిన్ మాత్రం విలువైన రెండు పాయింట్లు కోల్పోయింది.
తాజావార్తలు
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!