Site icon NTV Telugu

FIFA World Cup : చెత్త రికార్డుతో ప్రపంచకప్​నుంచి నిష్క్రమించిన ఖతార్ జట్టు

Fifa

Fifa

FIFA World Cup : అత్యంత చెత్త ప్రదర్శనతో ఆతిథ్య ఖతార్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం రాత్రి జరిగిన గ్రూప్‌–ఎ మ్యాచ్‌లో సెనెగల్‌ 3–1తో ఖతార్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు స్ట్రయికర్‌ బౌలయె దియా 41వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్‌ అందించారు. ఫమారా 48వ నిమిషంలో చేసిన గోల్ తో సెనెగల్ ఆధిక్యం 2–0కి పెరిగింది. దాంతో, ఖతార్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అయితే, 78 నిమిషంలో మొహమ్మద్‌ ముంటారి గోల్‌ చేయడంతో ఖతార్ 1–2తో రేసులోకి వచ్చేలా కనిపించింది. మరో గోల్ చేస్తే ఖతార్ డ్రాతో గట్టెక్కేలా కనిపించింది. కానీ, ఆరు నిమిషాల తర్వాత బంబా డియెంగ్‌ సెనెగల్‌కు మూడో గోల్‌ అందించడం ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఖతార్ 0–2తో ఈక్వెడార్ చేతిలో ఓడిపోయింది. దాంతో, రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ఈక్వెడార్‌ డ్రా చేసుకోవడంతో ఖతార్‌కు నాకౌట్‌ దారులు మూసుకుపోయాయి. 92 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన ఆతిథ్య జట్టుగా ఖతార్‌ అపఖ్యాతి మూటగట్టుకుంది.

Exit mobile version