FIFA World Cup : చెత్త రికార్డుతో ప్రపంచకప్‌నుంచి నిష్క్రమించిన ఖతార్ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup : అత్యంత చెత్త ప్రదర్శనతో ఆతిథ్య ఖతార్ జట్టు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం రాత్రి జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో సెనెగల్ 3–1తో ఖతార్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు స్ట్రయికర్ బౌలయె దియా 41వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్ అందించారు. ఫమారా 48వ నిమిషంలో చేసిన గోల్ తో సెనెగల్ ఆధిక్యం 2–0కి పెరిగింది. దాంతో, ఖతార్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అయితే, 78 నిమిషంలో మొహమ్మద్ ముంటారి గోల్ చేయడంతో ఖతార్ 1–2తో రేసులోకి వచ్చేలా కనిపించింది. మరో గోల్ చేస్తే ఖతార్ డ్రాతో గట్టెక్కేలా కనిపించింది. కానీ, ఆరు నిమిషాల తర్వాత బంబా డియెంగ్ సెనెగల్‌కు మూడో గోల్ అందించడం ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఖతార్ 0–2తో ఈక్వెడార్ చేతిలో ఓడిపోయింది. దాంతో, రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ఈక్వెడార్ డ్రా చేసుకోవడంతో ఖతార్‌కు నాకౌట్ దారులు మూసుకుపోయాయి. 92 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన ఆతిథ్య జట్టుగా ఖతార్ అపఖ్యాతి మూటగట్టుకుంది.
Also Read
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
- CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!