NTV Telugu Site icon

FSSAI: తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. ఎఫ్ఎఫ్ఎస్ఏఐ హెచ్చరిక..

Mother Milk

Mother Milk

FSSAI: పిల్లలకు తల్లి పాలు ఎంత విలువైనదో అందరికీ తెలిసిన విషయమే. తల్లి పాల ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి లభిస్తుంది. అయితే కొంత మంది తల్లులకు పాలు అందడం లేదని, మరికొంత మంది పిల్లలకు తల్లిపాలు అందడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాల బ్యాంకులను ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలు అందజేస్తోంది. అయితే తల్లి పాలను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) హెచ్చరించింది. అంతేకాదు.. తల్లి పాలను ప్రాసెస్‌ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకొచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది.

Read also: Riyan Parag Youtube: హాట్ అందాల కోసం తెగ వెతికాడు.. ప‌రాగ్ అన్న పెద్ద ఆటగాడే!

FSS-2006 చట్టం ప్రకారం, తల్లి పాలను అమ్మడం అనుమతించబడదు. ప్రభుత్వమే పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి నిరుపేద పిల్లలకు అందజేస్తుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. ప్రభుత్వం పాల బ్యాంకులను ఏర్పాటు చేసిందని వివరించారు. అయితే కొందరు అధిక లాభాల కోసం ఆన్‌లైన్‌లో తల్లి పాలను విక్రయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో ఇలాంటి విక్రయాలు జరుగుతున్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అనధికార విక్రయాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు తల్లి పాలను విక్రయించేందుకు ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా.. అధిక లాభాల కోసం ఆన్‌లైన్‌లో తల్లి పాలను విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
Children Sales: హైదరాబాద్‌ లో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు..