NTV Telugu Site icon

Trains Cancelled : ప్రయాణికులకు అప్డేట్‌.. పలు రైళ్లు రద్దు..

Train Engine

Train Engine

వాల్తేరు రైల్వే డివిజన్‌ పరిధిలోని పలాస-విశాఖ సెక్షన్ల మధ్య ఆధునికీకరణ పనులు చేపడుతుండడంతో ఈ నెల 19న కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని రీ షెడ్యూల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే అధికారులు. విశాఖ-బ్రహ్మపూర్‌ (18526), బ్రహ్మపూర్‌-విశాఖ (18525), విశాఖ-భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ (Visakha-Bhubaneswar Intercity) (22820), భువనేశ్వర్‌-విశాఖ ఇంటర్‌సిటీ (22819), విశాఖ-గుణుపూర్‌ (08522), గుణుపూర్‌-విశాఖ (08521), విశాఖ-పలాస (ఈఎంయూ 08532), పలాస-విశాఖ (ఈఎంయూ 08531) రైళ్లు రద్దయ్యాయి.

Also Read : Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.

అయితే.. విశాఖ-డిఘా ఎక్స్‌ప్రెస్‌ (22874) 3.30 గంటలు, భువనేశ్వర్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (12830) 3.30 గంటలు, భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020) ఒక గంట 30 నిమిషాలు, హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703) ఒక గంట 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. రేపు సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య వందేభారత్‌ ట్రైన్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయితే.. సోమవారం నుంచి వందే భారత్‌ రైలు సేవలు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.

Also Read : Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు