హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల పనుల దృష్ట్యా ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 23 ఎంఎంటీఎస్ సర్వీసులను 25వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంచుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది. అంతేకాకుండా.. దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రైలు ప్రయాణికులకు ట్రావెల్ అలర్ట్ జారీ చేసింది.
Also Read : First Night Accident: ఫస్ట్ నైట్ రోజే ప్రమాదం.. 26 కుట్లతో ప్రాణాలు కాపాడుకున్న నూతన వరుడు
జూన్ 19 నుండి జూన్ 25 వరకు చాలా రైళ్లు రద్దు చేయబడ్డాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పన కారణంగా జూన్ 19 నుంచి జూన్ 25 వరకు వారం రోజుల పాటు 28 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్‌వో) రాకేశ్ మీడియాకు విడుదల చేశారు. 6 రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, గుంతకల్-బోధన్ రైలు సర్వీసును రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు.
Also Read : Rajendra Prasad: ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది!!
అయితే.. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య ప్రయాణించే(ట్రైన్ నెంబర్లు.. 47129, 47132,47133,47135, 47136) రైళ్లను 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రద్దు చేశారు. ఇక హైదరాబాద్-లింగంపల్లి(47105, 47108,47109,47110, 47112) ట్రైన్లను కూడా 19 నుంచి 24 వరకు రద్దు చేశారు. ఉందానగర్-లింగంపల్లి(47165) రైలు 19 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లింగంపల్లి-ఫలక్‌నుమా(ట్రైన్ నెంబర్.47189), లింగంపల్లి-ఉదానగర్(47178), లింగంపల్లి-ఫలక్‌నుమా(47179), ఫలక్‌నుమా-లింగంపల్లి(47158), ఉదానగర్-లింగపల్లి(47211) ట్రైన్లను 19 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేశారు.
