Viral Video: మనిషికి డబ్బు వచ్చాక చేసే పనులు కొన్నిసార్లు హద్దులు దాటి ఉండేలా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. డబ్బు ఉన్నవారు తాము చేసే పనిలో ప్రత్యేకత చూపించేందుకు వింత మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అచ్చంగా అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒక విదేశీయుడు తన ఇంట్లో చాండిలియర్‌గా ఫెరారీ కారును వేలాడదీయడం ఇప్పుడు వైరల్ అయింది. సాధారణంగా ఇంట్లో చాండిలియర్ అంటే అద్భుతమైన లైటింగ్. కానీ, ఈ వ్యక్తి ఆ స్థానంలో ఫెరారీ కారును వేలాడదీశాడు. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా 4.2 కోట్లు. ఈ అద్భుత దృశ్యాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. నమ్మలేని విధంగా ఉన్న ఈ పనిని నెటిజన్స్ చూసి షాక్‌కు గురవుతున్నారు.
Sir Madam Trailer: అయ్యా బాబోయ్.. ఈ భార్యభర్తలు ఏంట్రా ఇలా ఉన్నారు.. ‘సార్ మేడమ్’ ట్రైలర్ రిలీజ్..!
ఈ కారు ఎంతలా విలువైనదో, అంతే జాగ్రత్తగా దానిని ఇంట్లోకి తీసుకువచ్చారు. వీడియో ప్రకారం.. దాదాపు 10 మంది కూలీలు కారును ఎత్తి, రెండు చెక్కలపై ఉంచి సురక్షితంగా ఇంట్లోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఎలాంటి స్క్రాచ్ లేకుండా బెడ్‌రూమ్‌కి దగ్గరగా 10 అడుగుల ఎత్తులో కారును వేలాడదీశారు. ఇది చూసిన నెటిజన్లు అతడికి ఏమైనా పిచ్చా అంటూ ట్రోల్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Coolie: అందరి కళ్లూ ‘కూలీ’పైనే!
ఇకపోతే, ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి విదేశీయుడు. పూర్తి వివరాలు అందుబాటులో లేకపోయినా, ఇతను ఒక క్లాసిక్ కార్ల కలెక్షనర్ అని సమాచారం. దానితో తన ఇంట్లో కూడా కారు ఉండాలన్న ఆలోచనతోనే ఇతను ఈ పని చేసాడట. ఇక అందులోనూ ఫెరారీ రేసింగ్ కారుని ఎంచుకోవడం వెనుక ప్రత్యేకంగా ఉండే డిజైన్, లైటింగ్ అలంకరణలే ప్రధాన కారణమని సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో, కొంతమంది ఇదే తరహా వింత ఆలోచనలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. పాత కార్లను చెత్తకు పంపించకుండా ఈ విధంగా ఇంట్లో డెకరేషన్‌గా మార్చితే, ఓ కొత్త స్టైల్ స్టేట్మెంట్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్‌ను బైక్స్, వాన్స్ వరకు తీసుకెళ్లే రోజులు దూరంలో లేవని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
This guy hung a $500,000 Ferrari in his sitting room as chandelier🤯 pic.twitter.com/l3Xt4RIeLS
— 𝐀𝐬𝐚𝐤𝐲𝐆𝐑𝐍 (@AsakyGRN) July 16, 2025
