Site icon NTV Telugu

Fenugreek Seeds : ఆగకుండా అయ్యే విరేచనాలను కట్ చేసే అద్భుతమైన చిట్కా

New Project (18)

New Project (18)

Fenugreek Seeds : రుచికి చేదుగానే ఉన్నా మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు ఉన్నాయి. ఎన్నో రోగాలతో పోరాడగలిగే శక్తి మెంతులకు ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ప్రతి వంటకంలో మెంతులను విరివిగా వాడేవారు. మెంతులను ఎక్కువగా ఊరగాయలు, పులుసు, పోపుల్లో వాడుతుంటారు. ఇటీవల వీటి వాడకం బాగా తగ్గిపోయింది. అవి ఉన్నా.. లేకపోయినా ఫర్వాలేదనే భావనలో ప్రస్తుతం ప్రజలు ఉన్నారు. మెంతులను పొడి చేసుకుని తిన్నా లేదా నీటిలో నానబెట్టి తాగినా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..

Read Also: Brij Bhushan:రెజ్లర్ల ఆందోళన..WFI అధ్యక్ష పదవికి భూషణ్ రాజీనామా!

మనం సాధారణంగా ఎదుర్కొనే కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు మెంతుల వల్ల చక్కని పరిష్కారం దొరుకుతుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే జీలకర్ర, మెంతులు, పసుపు, ఇలాచ్చి, లవంగం, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటాం. అందులో అజీర్తి సమస్యకు ‌మెంతులు చక్కని పరిష్కారం చూపుతాయి. వంట‌ల్లో సువాస‌నకు మాత్రమే కాదు.. మెంతులను వివిధ రకాలుగా తీసుకోవడం ద్వారా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మెంతులను నానబెట్టిన నీరు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. అదేవిధంగా అజీర్తి, క‌డుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు త‌గ్గిస్తాయి. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యం లేవ‌గానే ప‌రిగ‌డుపున ఆ నీళ్లను తాగాలి. దాంతో అజీర్తి స‌మ‌స్య తొల‌గిపోతుంది. మెంతులు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్రమ‌బ‌ద్దీక‌రిస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.

Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..

జుట్టు రాలే సమస్యను మెంతులు అరికడుతాయి. రంగు కూడా నెరవకుండా కాపాడతాయి. మెంతుల్లో శరీరానికి మేలు చేసే ఇనుము, పీచు పదార్థాలు, విటమిన్ C, B1, B2, కాల్షియంలు సమృద్ధిగా ఉన్నాయి. బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది. ఒక చెంచా మెంతుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవ‌డంవ‌ల్ల కూడా జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. విరేచ‌నాలు త‌గ్గడానికి కూడా మెంతులు తోడ్పడుతాయి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version