Site icon NTV Telugu

Harassment: గురుకుల విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. సంచలన విషయాలు వెల్లడించిన డీఎస్పీ

Harassment

Harassment

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరు టీచర్లు తమ వికృత చేష్టలతో ఉపాధ్యాయ లోకానికి మాయని మచ్చగా మారుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా గురుకుల విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని ఓ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడింది వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి. 10వ తరగతి విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైంది. షి టీమ్స్ అవేర్నెస్ కార్యక్రమంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read:Akhanda 2: ‘అఖండ తాండవం’ ఫైనాన్స్ ఇష్యూస్‌పై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు!

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను విచారించి వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజిని రాగమాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. డిఎస్పీ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. ఆగస్టు నుంచి ఈ వేధింపులు ఉన్నట్లు విచారణ లో తేలిందని వెల్లడించారు. నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు శారీరకంగా, లైంగిక వేధింపులకు పాల్పడేదని వెల్లడించారు. బాధిత విద్యార్థిని, తల్లి తండ్రులను ప్రిన్సిపాల్ బెదిరించినట్లు తెలిపారు.

Exit mobile version