Vijayawada: విజయవాడలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది.. మాచవరం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ… విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధులు నిర్వహిస్తోంది.. అయితే, నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు.. మరోవైపు.. సీఐ దుర్భాషలాడటంతో మహిళా కానిస్టేబుల్ భవానీ ఆత్మహత్యాయత్నం చేసినట్టు ప్రచారం సాగుతోంది.. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు.. అంతర్గత విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం చర్చగా మారింది.. ఈ మధ్య పోలీసుల డిపార్ట్‌మెంటులో వరుసగా ఆత్మహత్యలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సంచలం సృష్టించాయి.. ఇప్పుడు బెజవాడలోనూ ఇలాంటి ఘటనే జరగడంతో.. అసలు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతుంది? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: AP and Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా నిధులు విడుదల