NTV Telugu Site icon

Shikhar Dhawan : ప్రేమించండి.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి..

Dawan

Dawan

గత రెండు సంవత్సరాలుగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ లో బాగా ఆడుతున్నా టీ20ల్లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఆ తర్వాత వన్డే ఫార్మాట్ కి దూరమయ్యాడు. అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని గబ్బార్ వేరుగా ఉంటున్నాడు. తనకంటే వయసులో 10 సంవత్సరాలు పెద్దది.. అయినప్పటికి పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న అయేషా ముఖర్జీని ఫేస్ బుక్ లో చూసిన శిఖర్ ధావన్.. ఆమెను ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అయేషాకి అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరూ వేరుపడ్డారు. ఎట్టకేలకు తన విడాకుల గురించి గబ్బర్ ఓపెన్ అయ్యాడు.

Also Read : Cashew Rs.30 Per KG: జీడిపప్పు కిలో 30 రూపాయలు మాత్రమే..!

పెళ్లి అనే పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను.. ఎందుకంటే అది ఓ ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు.. రెండు వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష.. తను తప్పు చేసిందని అనను, అలాగని నాది తప్పని ఒప్పుకొను.. నాకు పెళ్లి అనే ఫీల్ కొత్త.. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు.. గత 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా.. కాబట్టి ఆ ఆట గురించి నాకు తెలుసు.. కానీ విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తునే ఉంది. ఒకవేళ భవిష్యత్ లో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్దలు కొట్టుకున్నా.. పర్లేదు, తొందర మాత్రం పడను.. అని శిఖర్ ధావన్ అన్నారు.

Also Read : Swara Bhasker: “పప్పు”కు మీరెందుకు భయపడుతున్నారు.. రాహుల్ గాంధీకి స్వరాభాస్కర్ మద్దతు

నాకు 26-27 ఏళ్లు వరకూ ఒంటరిగా ఉన్నా.. ఎలాంటి రిలేషన్ లోనూ లేను.. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని.. పుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని.. కానీ ఎవ్వరితో రిలేషన్ మాత్రం పెట్టుకోలేదని శిఖర్ ధావన్ అన్నారు. అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ చేసుకుంటూ పోయా.. కానీ కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయని గబ్బర్ పేర్కొన్నాడు. కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. రిలేషన్ లో ఉంటే.. అన్నింటినీ అనుభవించండి.. కోపాలు.. తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా.. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి.. పెళ్లి మాత్రం చేసుకోకండి.. కొన్నేళ్ల పాటు కలిసి ఉండి.. తన గురించి.. నీకు.. నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి అంటూ శిఖర్ ధావన్ తెలిపాడు.

Also Read : IPL 2023 : ఆర్సీబీకి షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్

అది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే.. కొందరికీ సెటిల్ అవ్వడానికి నాలుగు ఐదు మ్యాచుల్ సమయం పడుతుంది. మరొకొందరికీ ఒక్క మ్యాచ్ లోనే దొరకవచ్చు.. ఇంకొందరికీ ఇంకా ఎక్కవు సమయమే పట్టొచ్చని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. అయితే పెళ్లిక ముందు కాస్త అనుభవం మాత్రమ చాలా ముఖ్యం.. అంటూ ధావన్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. టీమిండియాలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్ లో అదరగొట్టి తన ప్లేస్ ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు.

Show comments