US Birthright Citizenship: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కును (birthright citizenship) రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే అతడు.. ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూహాంప్‌షైర్ ఫెడరల్ కోర్టు జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ ఆ ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని గురువారం నాడు వెల్లడించారు. అయితే, దీనిపై అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు.
Read Also: MLC Kavitha: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం..!
కాగా, ఫెడరల్ జడ్జి నిర్ణయంతో సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరిగే అవకాశం ఉంది. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దేశమంతటా వర్తిస్తాయా.. లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించే అవకాశం ఉంది. అయితే, అమెరికాలో పౌరసత్వ హక్కులపై గల చట్టపరమైన, రాజకీయమైన గొడవల్లో ఒక ముఖ్య ఘట్టం అని చెప్పుకోవాలి. సాంప్రదాయంగా అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికీ ఈ పౌరసత్వ హక్కు లభిస్తుందని 14వ రాజ్యాంగ సవరణ (14th Amendment)లో లఖించబడింది.
