Maharashtra: ‘స్నాప్‌చాట్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి తండ్రి నిరాకరణ..ఉరేసుకుని కుమార్తె ఆత్మహత్య
- ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఫోన్
- దీనికి తోడు భారీగా మెసేజింగ్ యాప్‌లు
- తొందరగా ఆకర్శితులవుతున్న చిన్నారులు.. యువత
- తన మంచి కోరి యాప్ వాడొద్దని చెప్పిన తండ్రికి గుండెకోత మిగిల్చిన కూతురు
స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే ఈ వస్తువు ప్రపంచాన్నే మన ముందుకు తెస్తోంది. రైలు టికెట్ బుకింగ్ నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ వరకు ప్రతీ పనిని స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వచ్చేశాయ్. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అవసరానికి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యసనంలా మారుతోంది. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు గంటల తరబడి ఫోన్లోనే గడుపుతున్నారు. దీనికి తోడు ‘మెసేజింగ్ యాప్‌లు’ భారీగా వచ్చాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఫోన్లను తక్కువగా ఉపయోగించకుండా ఆపినప్పుడు, పిల్లలు వినరు. ఏదో ఒక ఆఘాయిత్యానికి పాల్పడుతున్నారు.
READ MORE: Kalki 2898 AD: కల్కి అడ్వాన్స్ బుకింగ్.. మొదటి రోజు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలుసా..?
తాజాగా మహారాష్ట్రలో, ఒక తండ్రి తన మైనర్ కుమార్తెని ఆమె ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయవద్దని చెప్పాడు. దీంతో కుమార్తె ఆ తండ్రికి గుండె కోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర థానే జిల్లా డోంబివాలి ప్రాంతంలోని నీల్జేలో నివాసముంటున్న ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెకు ఫోన్ కొనిచ్చారు. తన మైనర్ కుమార్తె మొబైల్ ఫోన్లో ‘స్నాప్‌చాట్’ డౌన్లోడ్ చేసుకోవడానికి తండ్రి నిరాకరించారు. అప్పటికే ఆ అమ్మాయి తన మొబైల్ ఫోన్లో స్నాప్‌చాట్ యాప్ డౌన్లోడ్ చేసినట్లు గుర్తించిన తండ్రి ఈ మేరకు సూచన చేశారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక శుక్రవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న మాన్పాడ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..
-
Shreyas Iyer: ‘సర్పంచ్ సాబ్’.. శ్రేయస్ అయ్యర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
-
Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)
-
Adivi Sesh: ఒకరిని 150 మంది కలిపి కొట్టారు.. డెకాయిట్ బయటకు రప్పించింది!
-
Toyota Yaris Cross facelift: టయోటా యారిస్ క్రాస్ 2026 ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్, హైబ్రిడ్ మ్యాజిక్!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!