మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక నేడు ఫాదర్స్ డే సందర్బంగా తన కూతురుతో దిగిన స్పెషల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
క్లిన్ కారా ఫోటో కోసం మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు క్లిన్ కారా ఫొటోలు బయటకు వచ్చినా ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు రామ్ చరణ్, ఉపాసన.. ఇటీవల రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్బంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అది ఫాదర్స్ డే సందర్బంగా రిలీజ్ అయ్యింది.. ఆ సందర్బంగా తన కూతురుతో దిగిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..
రామ్ చరణ్ సింగిల్ గా తన కూతురుతో కలిసి దిగిన ఫోటో బయటకి రావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి, కూతురు గురించి, కూతురు తన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన మార్పుల గురించి పంచుకున్నాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమాను లైన్లో పెట్టాడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చెయ్యనున్నాడు..