Healthy Pregnancy; బిడ్డ కోసం ప్లాన్ చేసే పురుషులు ఇది తప్పకుండా చదవాలి – డాక్టర్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గర్భధారణ అనగానే అందరి దృష్టి మహిళలపైనే పడుతుంది. ఆరోగ్యం, ఆహారం, టెస్టులు, జాగ్రత్తలు ఇవి అన్నీ తల్లి బాధ్యతలుగా భావించడం మన సమాజంలో చాలా సాధారణం. కానీ తాజా పరిశోధనలు, వైద్యులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. గర్భధారణ విజయవంతం కావడం, సమస్యలు రాకపోవడం, బిడ్డ ఆరోగ్యం ఇవి అన్నీ తండ్రి వీర్యకణాల నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటాయట.
అవును గర్భధారణ లక్షణాలు, ప్రీక్లాంప్సియా, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలు మహిళలలో ఎందుకు వస్తాయి? దానికి కారణం వారు కాదు పురుషుల వీర్య కణాల ఆరోగ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం ఇప్పుడు బయటపడింది. ఇప్పటివరకు గర్భధారణ కోసం మహిళలే జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పెద్దల మాట. కానీ నేటి వైద్య శాస్త్రం చెబుతోంది ఏంటంటే బిడ్డ కోసం ప్రయత్నించే సమయంలో పురుషులు తమ జీవనశైలిని మార్చకపోతే, ప్రమాదం ఇద్దరికీ, కనబోయే బిడ్డకూ ఉంటుంది.
Also Read
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
వీర్య కణాల నాణ్యత గర్భధారణ లక్షణాలను ప్రభావితం చేస్తుందా?
వీర్య కణాలు పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 74 రోజులు పడుతుంది. అందుకే బిడ్డ కోసం ప్లాన్ చేసే పురుషులు కనీసం మూడు నెలల ముందే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిందేనని డాక్టర్‌లు సూచించారు. “గర్భధారణ అంటే మహిళల బాధ్యత మాత్రమే అన్న భావన తప్పు” అని స్పష్టం చేశారు.
వీర్య కణాలు పేలవంగా ఉంటే వచ్చే ప్రమాదాలు:
పురుషుల వీర్య కణాలు ఆరోగ్యంగా లేకపోతే గర్భధారణ సమయంలో పలురకాల సమస్యల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, గర్భధారణ మధుమేహం, వంటి ప్రమాదాలు ఎక్కువవుతాయని చెబుతున్నారు. అదేవిధంగా, పురుషుల ఆహారం, జీవనశైలి, ఒత్తిడి, ధూమపానం వంటి అలవాట్లు కేవలం వీర్య కణాల నిర్మాణాన్నే కాదు, వాటి జన్యు లక్షణాలను (Epigenetic Marks) కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల పుట్టబోయే పిల్లల్లో భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం,గుండె జబ్బులు వంటి సమస్యల ఎదురుకుంటారట.
పురుషులు ఏం చేయాలి?
వీర్యకణాల నాణ్యత మెరుగుపరచడానికి పురుషులు ఈ విషయాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం పూర్తిగా మానేయాలి, మద్యం తగ్గించాలి లేదా నివారించాలి, పోషకాహారం తీసుకోవాలి,జింక్, ఫోలేట్, ఒమేగా-3 లాంటి పోషకాలు ఆహారం లో చేర్చుకోవాలి. వ్యాయామం తప్పనిసరి, ఒత్తిడి తగ్గించే ధ్యానం, నడక వంటి అలవాట్లు పెంపొందించాలి. అంతే కాదు సరిగా నిద్రపోక పోవడం కూడా వీర్యకణాల నాణ్యత దెబ్బతీస్తుంది. అందుకే రోజుకు 7–8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఒత్తిడి ఇవి అన్నీ కలిసే మెరుగైన వీర్య కణాలకు, ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదం చేస్తాయి.
తాజావార్తలు
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!