SangaReddy: సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసాడు.
Read Also: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హరీష్ రావు, రాధా కిషన్ రావుపై ఆరోపణలు
పోలీసుల కథనం ప్రకారం.. హత్య అనంతరం గోపాల్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, అతని చెప్పిన సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఒక్కచోట యువకుడి చేయి, కాలు మాత్రమే కనిపించాయి. మిగతా భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దశరథ్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమ పేరుతో ఇలాంటి ఘోరమైన హత్యలు నేటి సమాజానికి గుండెలను కలచివేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.