Crime News: నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. కష్టపడి కని పెంచిన కొడుకును కన్నతండ్రే హతమార్చాడు. కొడుకు ఉమ్మడి రోహిత్‌ను తండ్రి రమేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆర్‌జీయం ఇంజనీరింగ్ కాలేజీలో రోహిత్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. రావూస్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేసి రమేష్ రిటైర్డ్ అయ్యాడు. 4 నెలల క్రితం అనారోగ్యంతో రమేష్ భార్య లక్ష్మీ మృతి చెందింది. భార్య మృతి తర్వాత రమేష్ తాగుడుకు బానిసయ్యాడు.
కొడుకు రోహిత్‌తో రమేష్ గొడవపడుతున్నాడు. ఈ గొడవల నేపథ్యంలో ఇంట్లో రోహిత్‌ను రమేష్ కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు. రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు కారణం క్షణికావేశమే కారణమని టూ టౌన్ సీఐ ప్రభాకరరెడ్డి వివరించారు.