Site icon NTV Telugu

Viral: హృదయ విదారకం.. కూతురి మృత‌దేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి

Madhya Pradesh

Madhya Pradesh

Viral: సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా సామాన్యుడికి కనీస వసతులు కరువయ్యాయి. అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే స్థోమత లేక‌ ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి వెలుగు చూసింది. ఓ తండ్రి త‌న కూతురి మృత‌దేహాన్ని కొన్ని కిలోమీట‌ర్ల మేర బైక్‌పైనే తీసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read Also:Summer Effect in Telugu States Live: రికార్డులను తిరగరాస్తున్న ఎండలు.. ఏంచేయాలి?

ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లా.. కోట గ్రామానికి చెందిన ల‌క్ష్మణ్ సింగ్ గౌడ్ కుమార్తె మాధురి గౌడ్ మే 12న అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను అదే రోజు షాదోల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సికెల్ సెల్ రోగంతో బాధ‌ప‌డుతున్న మాధురి రెండు రోజుల చికిత్స తర్వాత ప్రాణాలు కోల్పోయింది. డెడ్‌బాడీని కోట గ్రామానికి త‌రలించేందుకు అంబులెన్స్ స‌మ‌కూర్చాల‌ని హాస్పిటల్ డాక్టర్లను తన కుటుంబ సభ్యులు వేడుకున్నారు. కానీ వార విన్నపాన్ని పట్టించుకోలేదు. 15 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మాత్రమే అంబులెన్స్‌ను స‌మ‌కూర్చుతామ‌ని, 70 కిలోమీట‌ర్ల వ‌ర‌కు అంటే క‌ష్టం అని చెప్పారు.

Read Also:PM Modi: ఆరు రోజుల పాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ..

దీంతో ల‌క్ష్మణ్ సింగ్ త‌న కుమార్తె మృత‌దేహాన్ని బంధువు స‌హాయంతో బైక్‌పైనే తీసుకెళ్లాడు. ఈ దృశ్యాల‌ను ఓ వ్యక్తి ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కలెక్టర్ వందన స్పందించారు. ల‌క్ష్మణ్ సింగ్‌ను మార్గమధ్యంలోనే ఆపారు. జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ జీఎస్ ప‌రిహార్‌కు ఫోన్ చేసి, అంబులెన్స్ స‌మ‌కూర్చాల‌ని ఆదేశించారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్ స‌మ‌కూర్చి, మాధురి డెడ్‌బాడీని స్వగ్రామానికి త‌ర‌లించారు. ఆ కుటుంబానికి క‌లెక్టర్ ఆర్థికసాయం అందించారు.

Exit mobile version