NTV Telugu Site icon

Tragedy : మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. భారీ వర్షానికి నీట మునిగిన తండ్రీకూతురు

Rains

Rains

మహబూబాబాద్ జిల్లాలో విషాదం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి తండ్రి కూతురు నీట మునిగి చనిపోయారు. ఆదివారం ఉదయం మరిపెడ (మ) పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్న బ్రిడ్జి పై నుండి వరదనీరు.. ప్రవహిస్తున్న ప్రవాహాన్ని అంచనా వేయకుండా వెళ్లిన కారు కొట్టుకొని పోయి ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా గుర్తింపు. కారులో తండ్రీకూతురు ఇద్దరూ హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరారు. అయితే.. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి కొట్టుకుపోవడంతో ఇద్దరు గల్లంతు అయ్యారు. తమ కారు వాగులోకి మునిగి మెడవరకు నీరు వచ్చిందంటూ అంటూ బంధువులకు ఫోన్ లు చేసిన చెప్పిన కొద్ది సేపటికే ఫోన్ ఆఫ్ కావడంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెతికే పనిలో పడ్డారు అటు బంధువులు, ఇటు అధికారులు.

అయినప్పటికీ వెతికిన ఫలితం లేకపోవడం చివరికి మధ్యాహ్నం మరిపెడ మండలం బాలిని ధర్మారం లోని పంట పొలాల వద్ద అశ్విని మృతదేహం గుర్తించారు పోలీసులు. దానికి కొద్దీ దూరంలోనే వాగులో పూర్తిగా మునిగిఉన్న కారు కనిపించింది అశ్విని మృతదేహాన్ని స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు అధికారులు. కారు కూడా కనిపించకపోవడంతో అందులో తండ్రి అయినా మోతిలాల్ మృతదేహం ఆశాతో బంధువులు ఎదురుచూస్తున్నారు కానీ రిస్కూ టీంచేసినా ప్రయత్నం ఫలించలేదు వరద ఉదృతి ఎక్కువ ఉన్నందున కారు ను మాత్రం బయటకు తియ్యగలిగారు తండ్రి మోతిలాల్ ఆచూకీ ఇంకా దొరకలేదు. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వారు ఖమ్మం జిల్లా కారేపల్లి నుండి కారులో బయలుదేరి ఇలా కానరాని లోకాలకు వెళ్లారని విలపిస్తున్నా బంధువులు.