Site icon NTV Telugu

 Minor Couple’s Marriage: అడవిలో మైనర్ ప్రేమికుల రహస్య కలయిక.. గ్రామస్థులు చూసి ఏం చేశారంటే..?

Minors

Minors

Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో జరిగిన రహస్య సమావేశం ఓ మైనర్ ప్రేమ జంటకు మరపురాని సంఘటటనగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ రహస్య సమావేశాన్ని గ్రామస్థులు చూశారు. దీంతో ప్రేమ జంట కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబీకుల సమక్షంలో వారి వివాహం జరిపించారు. ఈ మైనర్ జంటకు వివాహం జరిగిన సంఘటనా స్థలంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు సైతం ఉన్నారు. ఆయన వివాహాన్ని ఆపకపోగా.. ఈ నూతన జంటను ఆశీర్వదించారు.

READ MORE: Minister Seethakka: అంగన్‌వాడీ చిన్నారిపై లైంగిక దాడి.. మంత్రి సీతక్క ఆగ్రహం

రాధానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్‌పూర్ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక సోషల్ మీడియా ద్వారా మెయిన్‌పురి జిల్లాకు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు తన స్నేహితురాలిని కలవడానికి మెయిన్‌పురి జిల్లా నుంచి ఫతేపూర్ జిల్లాకు వచ్చాడు. ఓ అడవిలో కలవాలని ప్లాన్ చేశారు. దీంతో గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. ఇరు కుటుంబాలకు ఫోన్ చేసి, గయ వెలుపల ఉన్న ఒక ఆలయంలోకి రప్పించారు. అక్కడ వారికి బాల్య వివాహం చేశారు. ఈ పెళ్లి వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చైల్డ్ లైన్ బృందం సహాయంతో పోలీసులు ఈ మైనర్ జంటను అదుపులోకి తీసుకున్నారు. వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు.. బాలికను వన్ స్టాప్ సెంటర్‌లో ఉంచారు. బాలుడిని చైల్డ్ లైన్ సెంటర్‌లో ఉంచారు. ఈ మైనర్ ప్రేమికుల వివాహం జరిపించిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

READ MORE: Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!

Exit mobile version