Crime: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నూతన వరుడితో సహా నలుగురు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు. స్థానికులు ఇద్దరిని కాపాడారు. ఇద్దరికీ గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఝాన్సీ జిల్లా ఎరిచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాటి గ్రామంలో నివసిస్తున్న ఆకాష్‌కు మే 10న వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపుతో బడా గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపర్ గ్రామానికి వెళ్తున్నాడు. ఆ కారులో ఆకాష్ తన సోదరుడు ఆశిష్, మేనల్లుడు ఐషు(7) మరో ఇద్దరు బంధువులు ఉన్నారు. డ్రైవర్ భగత్ కారు నడుపుతున్నాడు. కారు బడా గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పూర్ హైవేపై ఉన్న పారిచా ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం దాన్ని ఢీకొట్టింది.
READ MORE: Naveen Patnayak : ఒడిశాలో 45 ఏళ్లుగా అదే కులం చేతిలో అధికారం.. ఎందుకో తెలుసా ?
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
దీంతో కారు, డీసీఎం వాహనం మంటల్లో చిక్కుకున్నాయి. మంటలను చూసి కారులో ఉన్నవారంతా కేకలు వేశారు. డీసీఎం డ్రైవర్ దూకి పారిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో వెనుక నుంచి కారులో వచ్చిన బంధువులు కారు అద్దాన్ని పగులగొట్టి ఇద్దరిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుడు ఆకాష్, సోదరుడు ఆశిష్, మేనల్లుడు ఐషు, డ్రైవర్ మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. పోలీసులు కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర కుమార్ మాట్లాడుతూ.. కారులో 6 మంది ప్రయాణించినట్లు తెలిపారు. పెళ్లికొడుకుతో సహా మొత్తం నలుగురు సజీవదహనమైనట్లు చెప్పారు. ఆ మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!