యూపీలోని హాపూర్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) యునైటెడ్ కిసాన్ మోర్చా నిరసన వ్యక్తం చేసింది. రైతులు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత, కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఢిల్లీ-లక్నో రహదారిని దిగ్బంధించి అక్కడే బైఠాయించారు. దిష్టిబొమ్మ విషయంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దిష్టిబొమ్మను లాక్కున్నారు. హాపూర్ నగర్‌లో రైతులు, పోలీసుల మధ్య జరిగిన దిష్టిబొమ్మల వాగ్వాదం యొక్క చిత్రాలు తహసీల్ చౌపల్లె నుంచి వెలువడ్డాయి. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటని భారతీయ కిసాన్ యూనియన్ లోఖిత్ జాతీయ అధికార ప్రతినిధి హరీష్ హూన్ అన్నారు. కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు దిష్టిబొమ్మను బలవంతంగా లాక్కొని పారిపోయారన్నారు. ఎంపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: FEMA violation case: డీఎంకే ఎంపీకి షాక్.. రూ.908 కోట్లు జరిమానా
అసలేం జరిగిందంటే.. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతులు చేసిన ఆందోళనపై బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఈ వీడియోను ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నారు. రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని, అత్యాచారాలు జరిగేవని కంగన ఆరోపించారు. ఉద్యమం వెనుక చైనా, అమెరికాల కుట్ర ఉందని చెప్పారు. దీనిపై విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. ఆమె వ్యాఖ్యలు యావద్దేశంలో రైతుల్ని తీవ్రంగా అవమానించేవిగా ఉన్నాయని ఇటీవల లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. తాజాగా రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
कंगना के पुतले पर TUG OF WAR
हापुड़ : कंगना रनौत का पुतला फूंकने जा रहे किसान से पुतला लेकर भागी पुलिस, वीडियो वायरल#UttarPradesh | #kanaganaranaut | #Farmers | #UPPolice | #viralvideo pic.twitter.com/g7hEpPU8qG
— NDTV India (@ndtvindia) August 28, 2024
