NTV Telugu Site icon

Farmers Protest: రైతుల ఆందోళన.. ఢిల్లీలో మార్చి 12 వరకు 144 సెక్షన్!

144 Section In Delhi

144 Section In Delhi

144 Section in Delhi ahead of Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్‌ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు, ఘాజీపూర్, టిక్రి వద్ద భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ ఆంక్షలు తీవ్రమయ్యాయి. 5,000 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

ఢిల్లీ నగరంలో రైతుల ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని కూడా నిషేధించారు. లౌడ్‌ స్పీకర్ల వాడకంపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ భద్రతా చర్యల అమలు ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో ట్రాఫిక్‌ను ప్రభావితం చేసింది. సోమవారం ఉదయం ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగింది. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Also Read: AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్‌లో విచిత్రకర సంఘటన.. అప్పీల్‌ చేయలేదని..! వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్ర రైతు సంఘాలు మంగళవారం ‘మెగా మార్చ్’ నిర్వహించనున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ నిర్వహించతలపెట్టాయి. 2021లో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నప్పుడు పెట్టిన షరతుల్లో ఈ డిమాండ్ ఒకటి.