NTV Telugu Site icon

KTR: సీఎం ప్రజల్ని మోసం చేసి గెలిచాడు.. రైతు నిరసన దీక్షలో కేటీఆర్

Revanth Reddy Ktr

Revanth Reddy Ktr

KTR: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారని.. 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు కావచ్చినా ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని అన్నారు.

Read Also: Manchu Manoj : పోలీసులతో గొడవ.. వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్

రేవంత్ రెడ్డి అత్తగారి కల్వకుర్తి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి పథకం ప్రకారం ఒక్క తులం బంగారం కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి గెలిచాడని ఆయన అన్నారు. కానీ, ఆయనకు సిగ్గు శరం లేదంటూ అయినా కీలక వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం సహాయం చేయలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిందని.. 5 లక్షల భీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలు రైతులకు లభించాయని ఈ సందర్బంగా అయన గుర్తు చేసారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ పథకాలు కొనసాగించబడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు సమస్యలను వ్యక్తం చేస్తూ.. రుణమాఫీని, పథకాల అమలును బలోపేతం చేయాలని కోరారు.