Site icon NTV Telugu

NEET : నీట్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్ష వాయిదా.. ఎందుకంటే..?

Neet

Neet

NEET : జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరీక్షను ఒక్కే షిఫ్ట్‌లో నిర్వహించాల్సి ఉండటంతో, తగిన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS పేర్కొంది. త్వరలోనే పరీక్ష కోసం కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..

నీట్ పీజీ 2025 పరీక్ష నిర్వహణ విషయంలో మే 30న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియాల ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, పరీక్షను రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని స్పష్టం చేసింది. రెండు షిఫ్ట్‌ల విధానంలో ప్రశ్నాపత్రాల కఠినత స్థాయిలో తేడా ఉండే అవకాశం ఉండటంతో అది అసమతుల్యంగా మారే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

పరీక్షలో ప్రతీ మార్క్‌కు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో, నార్మలైజేషన్‌ విధానాన్ని సాధారణ పరీక్షలకన్నా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలని సూచించింది. పరీక్షా నిర్వహణలో పారదర్శకత పాటించడంతో పాటు, దేశవ్యాప్తంగా సురక్షిత పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలన్న సూచనను కూడా చేసింది. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు తెలిపిన NBEMS పై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక పరీక్ష తేదీ వాయిదా వేసే స్వేచ్ఛ NBEMS కు ఉందని కూడా కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 14న జరగనుంది.

CPI Ramakrishna: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తాం..

Exit mobile version