NTV Telugu Site icon

Dispute Over Missing Goats: తప్పిపోయిన మేకల విషయంలో వివాదం.. రైతును కాల్చిచంపేశాడు..

Dispute Over Missing Goats

Dispute Over Missing Goats

Dispute Over Missing Goats: తప్పిపోయిన మేకల విషయంలో జరిగిన గొడవ ఓ రైతు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయం సమీపంలో తప్పిపోయిన మేకల విషయంలో జరిగిన గొడవలో 58 ఏళ్ల రైతు కాల్చి చంపబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం మెట్టుపాళయం సమీపంలోని మందరైక్కాడు ప్రాంతంలోని చిన్నసామికి చెందిన పొలంలో కొన్ని మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేకల విషయంలో తన బంధువుల్లో ఒకరైన రంజిత్ కుమార్ (28) అనే వ్యక్తిపై అనుమానంగా ఉందని అతని వైపు వేలు చూపించాడు.

Murder For Lady: తాగిన మైకం.. యువతి కోసం స్నేహితుడి దారుణం

రంజిత్‌ తన ఇంటి పక్కనే వెళ్లడాన్ని గమనించిన చిన్నసామి వెంటనే అతడిని ఎదిరించి గొడవకు దిగాడు. తాను మేకలను దొంగిలించలేదని రంజిత్ చెబుతున్నప్పటికీ, చిన్నసామి అతన్ని కొట్టాడు. రంజిత్ గొడవ అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయి, అర్ధరాత్రి సమయంలో దేశీయ సింగిల్ బ్యారెల్ తుపాకీతో తిరిగి వచ్చి చిన్నసామిపై కాల్పులు జరిపాడు, ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రంజిత్‌కుమార్‌ను అరెస్టు చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.