Farmer Arrested For Killing Tigers with Poison :
తన ఆవును చంపేసిందని పులిపై ప్రతీకారం తీర్చకున్నాడు ఓ రైతు. ఈ ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవు కనిపించింది. అది చూడగానే ఆ రైతు దు:ఖం పొంగుకొచ్చి కోపం కట్టలు తెచ్చుకుంది. తన ఆవును చంపిన పులి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే ఆవు కళేబరానికి పురుగుల మందు రాశాడు. దాన్ని తిని పులులు మరణిస్తాయి అనుకున్నాడు. ఆ రైతు భావించినట్లుగానే రెండు పులులు ఆవును తిని మరణించాయి.
Also Read: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు
శనివారం ఎమరాల్డ్‌లోని నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అవి ఎలా చనిపోయాయని అధికారులు విచారిస్తుండగా వాటి సమీపంలో ఓ ఆవు కళేబరాన్ని గుర్తించారు. వెంటనే వారు ఆ కళేబరాన్ని టెస్టింగ్ కు పంపించారు. అందులో విషం ఉన్నట్లు గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆవు యజమానిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఆ రైతు అసలు విషయాన్ని బయటపెట్టాడు. తన ఆవును చంపేశాయన్న పగతోనే పులిని చంపేశానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వాటిలో మూడేళ్లు ఉన్న ఒక పులి, ఎనిమిదేళ్లున్న ఓ పులి ఉన్నాయి. అయితే మూడేళ్లు ఉన్న పులి శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో ఎనిమిదేళ్ల వయసున్న పులి చిన్న పులిపై చనిపోయే ముందు దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక పులి మరణానికి మాత్రం రైతు పూసిన విషమే కారణమని భావిస్తున్న పోలీసులు ప్రస్తుతం రైతును అరెస్ట్ చేశారు.