Site icon NTV Telugu

Faria Abdullah: ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడూ రెడీ

Faria Abdullah Photos

Faria Abdullah Photos

Faria Abdullah: తొలి సినిమా ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. చిట్టీగా కుర్రాళ్ల కలల రాణిగా మారింది.. బంగార్రాజుతో స్టెప్పులేసి మెరిసిపోయింది.. ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత డిఫరెంట్ కథల కోసం వెయిట్ చేసి సంతోష్ శోభన్ తో జతకట్టి ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆమె నటించిన ఈ మూవీ 4వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ ప్రశ్నలకు ఫరియా ఫన్నీగా స్పందించారు. తాను మొదటి నుంచి కూడా హిందీ సినిమాలను ఎక్కువగా చూసేదానినంటూ చెప్పారు. మొదటిసారిగా చూసిన తెలుగు సినిమా ‘వర్షం’మని.. అది చూసిన దగ్గరనుంచి త్రిషకు ఫ్యాన్ అయిపోయానంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆమె కోసమే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చాలా సార్లు చూశానన్నారు.. ఆ సినిమా నుంచి సిద్ధార్థ్ అంటే ఇష్టం ఏర్పడిందన్నారు.

Read Also: Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఫిక్స్ ?

ఏ దర్శకుడితో చేయాలని ఉందంటూ అలీ అడుగగా రాజమౌళిగారి దర్శకత్వంలో చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టింది. సంతోష్ మాత్రం తనతో వరుసగా సినిమాలు చేయడానికి మేర్లపాక గాంధీకి అభ్యంతరం లేకపోతే, తాను మాత్రం ఆయనతో చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటానంటూ సమాధానమిచ్చాడు. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లమీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది టీం.. ప్రోమోస్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.. ఇటీవల నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్టుగా విచ్చేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది..

Exit mobile version