Site icon NTV Telugu

Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!

Faria Abdullah

Faria Abdullah

‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. గ్లామర్ మాత్రమే కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్‌గా స్పందిస్తూ.. తాను ఒక హిందూ అబ్బాయితో డేటింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఇండస్ట్రీలో ఉంటూనే తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక తన ప్రియుడి ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read : Love Insurance: ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ డేట్ లీక్..

ఫరియా మనసు దోచుకున్న ఆ వ్యక్తి సినిమా పరిశ్రమకు చెందిన ఒక యంగ్ కొరియోగ్రాఫర్ కావడం విశేషం. తామిద్దరం కలిసి పని చేస్తున్నామని, తనలో దాగున్న డ్యాన్స్, మ్యూజిక్ టాలెంట్‌ను వెలికితీయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని ఫరియా పేర్కొంది. ముస్లిం మతానికి చెందిన ఫరియా, హిందూ అబ్బాయితో ప్రేమలో ఉండటంపై స్పందిస్తూ.. ‘మా బంధాన్ని కేవలం ఒక లవ్ అఫైర్‌గా నేను చూడను, ఇది ఒక బలమైన పార్టనర్‌షిప్’ అని తెలిపింది. ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ వంటి చిత్రాలతో జోరు మీదున్న ఈ బ్యూటీ, తన కెరీర్‌ను మలుపు తిప్పిన తన ప్రేమికుడి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version