సాదారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లేదా సక్సెస్ మీట్ లలో హీరో, హీరోయిన్లను కలుసుకోవాలని కొందరు అభిమానులు తెగ హడావిడి చేస్తారు.. కాళ్లు మొక్కడం లేదా స్టేజ్ పైకి దూసుకురావడం చేస్తుంటారు.. మొన్న ప్రేమలు హీరోయిన్ మమత బైజు కు ఏకంగా ఓ అభిమాని స్టేజ్ మీదే హారతి ఇచ్చాడు.. దానికి సంబందించిన వీడియోపై ఇప్పటికి నెట్టింట ట్రోల్స్ ఆగడం లేదు.. తాజాగా మంచు లక్ష్మీకి అలాంటి అనుభవం ఎదురైంది.. స్టేజై పైన అభిమాని చేసిన పనికి షాక్ అయ్యింది. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
మంచు లక్ష్మీ ప్రస్తుతం ‘ఆదిపర్వం’ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే నెలలో విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని గట్టిగానే ప్రమోషన్స్ ఇస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. అందులో ఒక అభిమాని వచ్చి మంచు లక్ష్మి కాళ్లు మొక్కి ఎమోషనల్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు..
స్టార్ హీరోల ఫంక్షన్స్ లో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం.. అలాంటిది మంచు లక్ష్మీకి ఇలాంటివి జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఈ సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఆదిపర్వం సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలతో దర్శకుడిగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న సంజీవ్ మెగోతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సుమ సుధీంద్ర మ్యూజిక్ ను అందించారు.. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి..
Orey em jaruguthundhi raaa😢🤣
pic.twitter.com/oDMfyQc1Yz— Anchor_Karthik (@Karthikk_7) March 19, 2024