Site icon NTV Telugu

Biggboss: బిగ్ బాస్ 7లో మొదలు కానున్న ఫ్యామిలీ వీక్.. ఎవరి కోసం ఎవరు వస్తున్నారో తెలుసా ?

Bigg Boss7

Bigg Boss7

Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది. ఇటు కంటెస్టెంట్లు, అటు ప్రేక్షకులు ఊహించని విధంగా ఎన్నో మలుపులు తిరుగుతూనే ఉంది. గత ఆరు సీజన్‌లను పరిశీలిస్తే షో మొత్తం టైంలో ఓ ఫ్యామిలీ వీక్ తప్పనిసరి. ఆ వారమంతా జనాలకు వినోదమే. ఈ సీజన్‌లో ఫ్యామిలీ వీక్ ఇంకా ప్రారంభం కాలేదు. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎవరు ఎవరి కోసం వస్తారు? అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఈ ఆదివారం ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత 11 మంది కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ షో ఉల్టా పుల్టా కావడంతో… తమ ఫ్యామిలీతో పాటు ఎంకరేజ్ చేస్తున్న సెలబ్రిటీలు సైతం ఎంటర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.. ఏ కంటెస్టెంట్ కోసం ఎవరు వస్తారో చూద్దాం.

Read Also:Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన

షోలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న శివాజీ కోసం అతని భార్య, కుమార్తె ఇంట్లోకి వస్తారని తెలుస్తోంది. రైతు బిడ్డ కోసం తన తండ్రి హౌస్లోకి రానున్నాడు. అంతే కాకుండా తనకు సపోర్టు చేస్తున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా అడుగుపెట్టనున్నాడు. అమర్ కోసం అతని భార్య తేజస్విని వెళ్తుంది. ప్రిన్స్ యావర్ కోసం తన అన్న హౌస్ లోకి ప్రవేశించనున్నాడు. అర్జున్ కోసం తన భార్య సురేఖ వెళ్తుంది. గౌతం కృష్ణ కోసం అతని తల్లి మంగాదేవి, ప్రియాంక కోసం ఆమె ప్రియుడు శివ వెళ్తాడు. ఈ వారం అంతా హడావిడిగా సాగుతుంది. తమ కుటుంబంతో తమకున్న బంధాన్ని చూపిస్తూ ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యులపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also:Liquor Sales Banned: మందు బాబులకు అలర్ట్.. ఆ మూడు రోజు వైన్స్‌లు, బార్లు బంద్‌

Exit mobile version