Family Suicide: ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. గుట్కా కొనడం కోసం భర్త డబ్బు ఇవ్వలేదని మనస్తాపానికి గురైన మహిళ విషం తాగి ఇద్దరు చిన్నారులతో కలసి ప్రాణాలు తీసుకుంది. మరో చిన్నారి ఈ విషప్రయోగం నుంచి తప్పించుకున్నప్పటికీ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 26 ఏళ్ల జ్యోతి యాదవ్ అనే మహిళా శనివారం ఉదయం భర్త బబ్బు యాదవ్ దగ్గర గుట్కా కొనేందుకు డబ్బు అడిగింది. కానీ, ఆయన నిరాకరించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజున సాయంత్రం జ్యోతి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె మాత్రమే విషం తాగడమే కాకుండా తన ముగ్గురు పిల్లలకు కూడా ఇచ్చింది.
Minister Ramprasad Reddy: మంత్రి రాసలీలల ఆరోపణలు హాస్యాస్పదం.. వైసీపీపై మండిపల్లి ఫైర్!
సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన భర్త బబ్బు, నలుగురేళ్ల కుమారుడు నొప్పితో విలవిల్లాడుతూ “అమ్మ ఏదో చేదుగా ఉన్నది ఇచ్చింది” అంటూ ఏడుస్తూ కనిపించాడు. అప్పటికే చిన్న కుమార్తె, ఏడాది వయసున్న బుల్బుల్ ఊపిరి ఆడక మృతి చెందారు. జ్యోతి గది లోపలే స్పృహ తప్పి పడి ఉండగా మరో కుమార్తె చంద్రమా (4) పరిస్థితి కూడా విషమంగా ఉంది. వెంటనే వారిని మజ్‌గావాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా వైద్యులు బుల్బుల్ మృతి చెందినట్లు ధృవీకరించారు. పరిస్థితి విషమించడంతో మిగిలిన వారిని సత్నా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో జ్యోతి, చంద్రమా మృతిచెందారు. ఐదేళ్ల దీప్ చాంద్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోందని సమాచారం.
Asia Cup 2025: రషీద్ ఖాన్ కెప్టెన్‌గా ఆసియా కప్ బరిలోకి ఆఫ్ఘనిస్తాన్.. జట్టు ప్రకటన!
గ్రామస్థులు, బంధువుల ప్రకారం జ్యోతి గుట్కా అలవాటు కారణంగానే తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని తెలిపారు. పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని భర్త పలు మార్లు అడ్డుకున్నా, ఆమె అలవాటు మానలేదని చెప్పారు. ఈ ఘటనపై వైద్యులు, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. మజ్‌గావాన్ మెడికల్ ఆఫీసర్ రూపేష్ సోని ప్రకారం, బాధితులను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడే విషప్రయోగం లక్షణాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు.
