Site icon NTV Telugu

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ఓ కుటుంబం బలి

Online Betting

Online Betting

Online Betting: కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ వేదికగా వేదికగా ఎందరో ఆన్‌లైన్ బెట్టింగ్ కాస్తూ, అప్పుల ఊబిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌కు ఓ కుటుంబం బలైంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. ఇక అప్పుల బాధ భరించలేక తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.

Read Also: Sachin Kurmi: ఎన్సీపీ నేత దారుణ హత్య.. ఉద్రిక్తత వాతవరణం

Exit mobile version