Falimy : ఓటీటీ లోకి వచ్చేసిన మరో మలయాళ సూపర్ హిట్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2018, పద్మినీ, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్క్వాడ్ ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి.అయితే ప్రతివారం ఏదో ఒక మలయాళ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటుంది.ఇక్కడి ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్ బసిల్ జోసెఫ్ నటించిన ‘ఫలిమీ’. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో మెప్పించింది. థియేటర్లలో ఎంతగానో మెప్పించిన ‘ఫలిమీ ‘ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ మరియు కన్నడ భాషల్లోనూ ఈ స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేసింది. నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఫలిమీ మూవీలో బసిల్ జోసెఫ్ తో పాటు జగదీశ్, మంజూ పిళ్ళై, సందీప్ ప్రదీప్, మీనరాజ్ మరియు రైనా రాధాకృష్ణ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.ఫలిమీ కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో తీసిన రోడ్ జర్నీ మూవీ ఇది. అనూప్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంటాడు. ఇంట్లో ఖాళీగా ఉండే తండ్రి, ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసే తల్లి, అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే తమ్ముడు మరియు కాశీకి పోవాలని ప్రయత్నాలు చేసే తాతయ్య.. ఇది అనూప్ ఫ్యామిలీ స్టోరీ. 15 మంది అమ్మాయిలను చూసిన తర్వాత అనూప్ కు పెళ్లి కుదురుతుంది. అయితే నిశ్చితార్థం రోజున జరిగిన ఒక సంఘటనతో ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కాశీ కి వెళ్లిపోతారు. మరి కాశీ ప్రయాణంలో అనూప్ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా కథ..
Also Read
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!