NTV Telugu Site icon

Family Suicide: ఇంట్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..?

Suicide

Suicide

Family Suicide: మహారాష్ట్రలోని ధులే జిల్లా నుంచి సంచలన సంఘటన జరిగింది. ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో శవమై కనిపించారని., వారి మృతదేహాలు కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్యా లేక కుటుంబ సభ్యుల ఆత్మహత్యా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అందిన సమచారం ప్రకారం, ఈ కేసులో ఒక అధికారి మాట్లాడుతూ.., ప్రమోద్ నగర్ ప్రాంతంలోని ఒక కాలనీలో జరిగిన ఈ సంఘటన రాత్రి 11 గంటలకు కొంతమంది పొరుగువారు కుటుంబం యొక్క బంగ్లా నుండి భరించలేని వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. బంగ్లాలో ప్రవీణ్ సింగ్ గిరాసే (53), అతని భార్య దీపాంజలి (47), వారి పిల్లలు మితేష్ (18), సోహమ్ (15) మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

Train Incident: దారుణం.. రైలును బోల్తా కొట్టించేందుకు భారీ కుట్ర!

దంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్ సింగ్ మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని, అతని భార్య పిల్లలు నేలపై చనిపోయారని అధికారి తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి లేఖ లభించలేదని ఆయన తెలిపారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. గత రెండు రోజులుగా ఇంట్లో ఎలాంటి కదలిక కనిపించలేదని తెలిపారు. ధులేలోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా భార్య, ఇద్దరు పిల్లలు విషపూరితమైన పదార్థాలను సేవించినట్లు తేలిందని అధికారి తెలిపారు. లంకాని గ్రామంలో గిరాసేకు పురుగుమందులు విక్రయించే దుకాణం ఉందని, అతని భార్య టీచర్‌ అని, పిల్లలు చదువుతున్నారని తెలిపారు. అసలు మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. గిరాసేతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేదా.. ఈ చర్యకు దిగడానికి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. దేవ్‌పూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

Kolkata Rape Murder Case: సీఎం మమతకు ఉపశమనం.. సమ్మెను విరమించుకున్న జూనియర్ డాక్టర్లు..

Show comments