NTV Telugu Site icon

Falcon Scam : ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు

Falcon

Falcon

Falcon Scam : ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో వేల మందిని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ECIR) నమోదు చేయడంతో విచారణ మరింత వేగవంతమైంది.

హైదరాబాద్ హైటెక్ సిటీ హుడా ఎన్‌క్లేవ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ, ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అధిక లాభాలను వాగ్దానం చేసి, రూ.1,700 కోట్ల మేర నిధులను సమీకరించింది. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నివేదిక ప్రకారం, ఈ సంస్థ నిర్వాహకులు దుబాయ్, మలేషియా సహా 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లను మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది.

 Kadapa: కడప కార్పొరేషన్‌ అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తి.. ప్రభుత్వానికి నివేదిక

ఈ కేసులో మొత్తం 19 మందిపై కేసులు నమోదు కాగా, ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య , ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంత ఇప్పటికే అరెస్టయ్యారు. అయితే, ఫాల్కన్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్, సీఏవో ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ లతో పాటు మరికొందరు నిందితులు దుబాయ్‌కి పారిపోయినట్లు సమాచారం. ఈడీ దర్యాప్తులో భాగంగా, ఈ సంస్థ విదేశీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నిధులను ట్రాక్ చేయడంతో పాటు, క్రిప్టోకరెన్సీ, హవాలా మార్గాల్లో జరిగిన లావాదేవీలపై విశ్లేషణ చేపట్టింది.

గత నాలుగేళ్లుగా ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 6,979 మంది డిపాజిటర్ల నుంచి పెట్టుబడులు సమీకరించింది. వారికీ ఏడాదికి 11% నుండి 22% వరకు రాబడి అందిస్తామని మభ్యపెట్టి భారీ స్థాయిలో మోసం చేసింది. ఈ కేసులో సంబంధిత నిందితుల ఇళ్లపై ఈడీ రెండు నుంచి మూడు రోజుల్లో సోదాలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 Kash Patel: FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం.. ట్రంప్ ప్రశంసలు