CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రేపటి నుంచి అన్ని ఆడియో వీడియో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనాలకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షిస్తామని, కాల్స్ రికార్డు చేస్తామని ఓ పోస్ట్‌లో తప్పుడు వార్తను షేర్ చేశారు. ఈ అంశంపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. తన ఫొటోతో ముద్రించిన ఈ నకిలీ పోస్ట్‌పై సీరియస్ అయ్యారు. వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
READ MORE: YS Jagan : ఇవన్నీ మానవ తప్పిదాలు.. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది
అసలు ఆ పోస్ట్‌లో ఏముంది..?
రేపటి నుంచి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతున్నాయని సీపీ సజ్జనార్ ఫోటో ఉపయోగించి తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పేరుతో పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అన్ని కాల్స్ రికార్డు, సేవ్ చేయబడతాయని, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్(ఎక్స్) అన్ని షోషల్ మీడియాలు పర్యవేక్షించబడతాయని ప్రచారం జరిగింది. అలాగే మీ ఫోన్ మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుందని పోస్టర్‌లో తప్పుడు ప్రచారాన్ని వ్యక్తి చేశారు. దీంతో ఈ పోస్టర్ వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
