Site icon NTV Telugu

Fake police: పెందుర్తిలో నకిలీ పోలీసుల హల్చల్..

Fake Police

Fake Police

విశాఖపట్నంలోని పెందుర్తిలో నకిలీ పోలీసుల హల్చల్ చేశారు. పోలీసులమంటూ బెదిరించి దోపిడీకి దిగారు. యువతీ, యువకుడి ఫొటోస్ తీసి నకిలీ పోలీసుల డబ్బులు డిమాండ్ చేశారు. పోలీస్ యూనిఫాం, ఆర్మీ టోపీ ధరించి యువతీ యువకుడిని బెదిరించారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించడంతో పాటు యువతితో అసభ్యంగా ఈ నకిలీ పోలీసులు ప్రవర్తించారు.

Read Also: Bhola Shankar Twitter Review: భోళాశంకర్‌ ట్విట్టర్ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే?

భయాందోళనకు గురైన రాధాకృష్ణ రూ.400 నగదు, మరో రూ.16 వేలు ఫోన్‌పే ద్వారా వారికి పంపించారు. జరిగిన విషయంపై పెందుర్తి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తులపై అనుమానంతో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బెదిరింపులకు పాల్పడిన నిందితులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై గతంలో పెందుర్తితో పాటు గోపాలపట్నం, విజయనగరం, గంట్యాడ, విశాఖ మహిళా పోలీస్‌ స్టేషన్‌, విజయనగరం దిశ పోలీస్‌ స్టేషన్‌, తూర్పు గోదావరి జిల్లా కోరింగ ప్రాంతాల్లో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Read Also: Shamshabad: శంషాబాద్ పరిధిలో మరో దిశ ఘటన.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు..!

16 కేసుల్లో నిందితుడైన విజయనగరం జిల్లా ఎస్‌.కోట దరి మామిడిపల్లికి చెందిన ఈతలపాక శివప్రసాద్‌, ఇతనితో పాటు నేరానికి పాల్పడిన అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీకి చెందిన పట్టాసి అశోక్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వీరి దగ్గర నుంచి ఒక స్కూటీ, మూడు ఫోన్లు, పోలీసు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ నిందితుల చేతుల్లో ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Exit mobile version